ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ కార్పోరేట్ల‌రు… గ్రేట‌ర్ టీఆర్ఎస్ పంచాయితీ

గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో లోక‌ల్ వార్ టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పార్టీప‌రంగా టీఆర్ఎస్ వేస్తున్న క‌మిటీలు స్థానిక నేత‌ల్లో ఆగ్ర‌హావేశాల‌కు కార‌ణం అవుతుంది. కార్పోరేట‌ర్లంతా త‌మ ప‌రిధిలో డివిజ‌న్ క‌మిటీలు త‌మ‌కు అనుకూలంగా ఉన్న వారికే ద‌క్కాల‌ని కోరుకుంటుంటే… ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్ లు త‌మ వారికి ప‌ద‌వుల కోసం పోటీ ప‌డుతున్నారు.

ఇప్ప‌టికే అంబ‌ర్ పేట‌లో పార్టీ వ్య‌వ‌హ‌రం రోడ్డుపై ప‌డింది. దీనిపై తెలంగాణ భ‌వ‌న్ ఆరా తీయ‌గా… ఇప్పుడు మంగ‌ళ్ హ‌ట్ ఇష్యూ కేటీఆర్ వ‌ద్ద‌కు చేరింది. దీంతో గ్రేట‌ర్ విష‌యంలో మంత్రి త‌ల‌సానితో క‌లిసి కేటీఆర్ ఇష్యూ చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఒక్క గ్రేట‌ర్ లోనే కాదు రాష్ట్రమంతా ఇదే ప‌రిస్థితి ఉన్నా… గ్రేట‌ర్ లో టీఆర్ఎస్ ఓవ‌ర్ లోడ్ అయ్యింది. ఆ పార్టీ, ఈ పార్టీ నుండి అని తేడా లేకుండా నేత‌ల‌ను ర‌క‌ర‌కాల హామీలతో చేర్చుకున్నారు. ఇప్పుడు పార్టీ ప‌ద‌వుల పందేరం వ‌చ్చేస‌రికి ఒక్కో గ్రూప్ బ‌య‌ట‌ప‌డుతుంది. ఇలాంటివి అంతిమంగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు లాభ‌ప‌డ‌తాయ‌న్న ఉద్దేశంతో కేటీఆర్ రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది.