హుజురాబాద్ ఎన్నిక‌- టీఆర్ఎస్ కు కొత్త‌ టెన్ష‌న్

హుజురాబాద్ ఉప ఎన్నిక ముంచుకొచ్చేస్తుంది. ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు వేసే ఎత్తులే కాదు ప‌రోక్షంగా ఉప ఎన్నిక‌ను ప్ర‌భావితం చేసే అంశాల‌పై కూడా పార్టీలు ఫోక‌స్ చేశాయి. ఈట‌ల‌ను ఎలాగైనా ఓడించాల‌న్న క‌సితో ఉన్న టీఆర్ఎస్ ఇప్ప‌టికే రాజేంద‌ర్ పేరుతో ప‌లువురితో నామినేష‌న్లు వేయించింది. ఇంగ్లీషు అక్ష‌రంలో ఈట‌ల‌కు వ‌చ్చే ఈ అనే అక్ష‌రం కూడా క‌లిసేలా ప్లాన్ చేశారు.

ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను టీఆర్ఎస్ ప్ర‌భావితం చేస్తుంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తుండ‌గా… ఇప్పుడు టీఆర్ఎస్ కు వ‌చ్చే ఇండిపెండెంట్ల గుర్తుల భ‌యం ప‌ట్టుకుంది. గ‌తంలో జ‌రిగిన ప‌లు ఎన్నిక‌ల్లో కారు గుర్తును పోలిన ట్ర‌క్కు, రోడ్డు రోల‌ర్ సింబ‌ల్స్ టీఆర్ఎస్ ఓట్ల‌ను భారీగానే చీల్చాయి. ఇలాంటి గుర్తులు కేటాయించ‌వ‌ద్ద‌ని అప్ప‌ట్లో టీఆర్ఎస్ కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కూడా క‌లిసి వ‌చ్చింది. ఇప్పుడు ఇదే గుర్తుల భ‌యం టీఆర్ఎస్ ను వెంటాడుతోంది.

ఈసారి కూడా కారు గుర్తును పోలిన గుర్తులు వ‌స్తే… ఈట‌ల‌తో జ‌రుగుతున్న ట‌ఫ్ ఫైట్ లో ఇబ్బంది త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని టీఆర్ఎస్ నేత‌లు టెన్ష‌న్ ప‌డుతున్నారు.