చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన “ఆచార్య” సినిమా తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించడంతో ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. తండ్రి , కొడుకులు కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం.
కథ
ధర్మస్తలి గురుకులం రక్షకుడిగా సిద్ద ( రామ్ చరణ్ ) వ్యవహరిస్తూ ఉంటాడు. చాలా ప్రసిద్ది గాంచిన ధర్మస్థలిపై బసవ ( సోనుసూద్ ) కన్నేస్తాడు. ఎలాగైనా ధర్మస్థలిని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే అనూహ్య కారణాల వలన సిద్ద ధర్మస్థలిని వదిలేస్తాడు. ఈ కారణంగా ధర్మస్థలి సమస్యల్లో పడుతుంది. అప్పుడే ఆచార్య ( చిరంజీవి )అక్కడకు వస్తాడు. ఎందుకు ఆచార్య అక్కడకు వస్తాడు..? అసలు సిద్దకు ఆచార్యకు ఉన్న సంబంధం ఏంటి.? బసవ నుంచి ధర్మస్థలిని ఎలా రక్షిస్తాడనేది ఆచార్య కథ.
ఈ సినిమాలో మెగాస్టార్ , మెగా పవర్ స్టార్ ల నటన అద్భుతంగా ఉంటుంది. డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో చిరు తనలో మునుపటి కళ తగ్గలేదని ఆచార్య తో మరోసారి చూపించాడు. ఆచార్యలో చరణ్ పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ కొంచెంలో కూడా అదుర్స్ అనిపించాడు.
సిద్ద పాత్రకు చరణ్ లుక్ బాగా సెట్ అయింది. తన పాత్రకు తగిన న్యాయం చేశాడు చరణ్. తండ్రి , కొడుకులు పోటీ పడి నటించారు. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు డాన్సుల్లో కూడా తండ్రి పాత్ర తో పోటీ పడ్డాడు. తండ్రి కొడుకు నటించిన సన్నివేశాలు మెగా ఫ్యాన్స్ కి కన్నుల విందు చేస్తాయి. పూజ హెగ్డే చిన్న పాత్రలో కనిపించి తను కూడా ఉన్నంత సేపు మెప్పించింది.
మణిశర్మ పాటలు , సంగీత నేపథ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ కు ముందే ఆచార్య పాటలకు భారీ హైప్ వచ్చింది కాని, ఈ సినిమా కోసం మంచి నేపధ్య సంగీతాన్ని ఇవ్వడంలో విఫలం అయ్యారు. దర్శకుడు కొరటాల శివ మణిశర్మ నుండి బెస్ట్ ఔట్ పుట్ ను రాబట్టుకోలేక పోయారు. కథ విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదని అనిపించింది. రామ్ చరణ్ పాత్రను సాగదీసినట్లుగా అనిపించింది. ఓవరాల్ గా మాత్రం సినిమా నిరాశ పర్చిందని చెప్పక తప్పదు.
ప్లస్ పాయింట్స్ :
చిరంజీవి, రామ్ చరణ్ లు నటించడం
మైనస్ పాయింట్స్ :
కథ సాగదీత
స్క్రీన్ ప్లే,
కథలో పట్టుత్వం లేకపోవడం