Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsకట్టప్ప ఆరోగ్యం పరిస్థితి విషమం- క్లారిటీ ఇచ్చిన కుమారుడు

కట్టప్ప ఆరోగ్యం పరిస్థితి విషమం- క్లారిటీ ఇచ్చిన కుమారుడు

కరోనా బారిన పడిన ప్రముఖ నటుడు సత్యరాజ్ ఆరోగ్య పరిస్థితి తాజాగా కుదుట పడినట్లు అతని కుమారుడు సిబి సత్యరాజ్ తెలిపాడు. ఆయన కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారని చెప్పుకొచ్చారు. ఎవరూ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆయనను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని దాంతో కొన్ని రోజులపటు ఇంటికే పరిమితం అవుతారని చెప్పారు. పూర్తిగా ఫిట్ అయ్యాక సత్యరాజ్ తన పనిని తిరిగి ప్రారంభిస్తాడని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా… గత రెండు రోజులుగా సత్యరాజ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తలు సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేశాయి. దాంతో సత్యరాజ్ కోలుకోవాలని ఆయన అభిమానులు పూజలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని సత్యరాజ్ కుమారుడు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments