మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నియంత్రిచే విధంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న నేతలంతా ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.
- మైనర్లు, మహిళలపై జరిగే అత్యాచారాలతోపాటు అన్ని రకాల అఘాయిత్యాలకు సంబంధించి కేసు నమోదైన 3 వారాల్లోగా పరిష్కరించి నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వర న్యాయం చర్యలు తీసుకోవాలి.
జూబిలీహిల్స్ నిందితురాలికి రక్షణ కల్పించాలి. ఈ కేసు విచారణను సిబిఐ కి ఇవ్వాలి
నిందితుల నేపథ్యంతో సంబంధం లేకుండా కేసు నమోదు చేసిన తక్షణమే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కేసు విచారణలో వీవీఐపీలు / పెద్దల జోక్యాన్ని పూర్తిగా నివారించాలి. - ప్రతి మండలంలో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. పోలీసు శాఖలో మహిళల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచాలి. ప్రస్తుతం పోలీస్ శాఖలో 5.1 శాతం మంది మాత్రమే మహిళా సిబ్బంది పని చేస్తున్నారు.
- ప్రతి జిల్లాలో నేరం జరిగినప్పుడు అత్యవసరంగా స్పందించడానికి, ఫిర్యాదులను స్వీకరించడానికి వీలుగా 3 అంకెలతో కూడిన హెల్ప్ లైన్లను కలిగి ఉండే కంట్రోల్ రూమ్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.
- గతంలో లైంగిక దాడులకు పాల్పడిన నిందితుల వివరాలతో కూడిన డేటాను డిజిటలైజ్ చేయాలి. లైంగిక దాడులు తిరిగి పునరావృత్తం కాకుండా వారిపై నిరంతరం నిఘా ఉంచాలి.
- విద్యుత్, వెలుతురు లేకుండా చీకటిగా ఉండే పబ్లిక్/ బహిరంగ ప్రదేశాలను గుర్తించాలి. వాటికి విద్యుత్ సౌకర్యం కల్పించే చర్యలు తీసుకోవాలి.
- తరుచు నేరాలు జరిగే ప్రదేశాలు, ప్రజలు ఆభద్రతగా భావించే ప్రదేశాల వివరాలతో కూడిన మ్యాప్ ను రూపొందించాలి. అటువంటి ప్రదేశాల్లో పోలీసుల నిఘాను, పెట్రోలింగ్ పెంచాలి. తద్వారా ఆ ప్రదేశాలు కూడా సురక్షితమనే భావన మహిళల్లో కలిగించాలి. అంతేకాకుండా సదరు ప్రదేశాల్లో ఏవరైనా ప్రమాదంలో ఉంటే 5 నిమిషాల్లో SOS మెసేజ్ సంబంధిత అధికారులకు చేరే విధంగా వ్యవస్థను రూపొందించుకోవాలి.
- మహిళలు కాలకృత్యాల కోసం బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లకుండా ప్రతి 4 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వం మరుగుదొడ్లను నిర్మించాలి.
- డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలి. నిరంతం నిఘా, పర్యవేక్షణ ద్వారా డ్రగ్స్ నెట్ వర్క్ ను పూర్తిగా నిర్మూలించాలి. బెల్టు షాపులను నిషేధించాలి. పబ్బులు, హుక్కా పార్లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడానికి వీలుగా కఠినమైన ఎక్సైజ్ పాలసీని తీసుకురావాలి.
- మహిళల అవసరాలకనుగుణంగా టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపాలి. మహిళలు బస్సులు, మెట్రో వంటి ప్రజ వినియోగించుకునేలా వాటి సర్వీసులను పెంచాలి. రవాణా వ్యవస్థలను
- ఆర్టీసీ, మెట్రోల్లో ప్రయాణించే మహిళలకు రాయితీలు, సబ్సిడీలు ఇచ్చే చేయాలి.
- మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణనిచ్చి వారికి కమర్షియల్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించాలి. వారిని ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవర్లుగా, వాహానాలనునియంత్రించే ప్లీట్ ఆపరేటర్లుగా అంటే కంట్రోలర్లుగా నియమించే విధంగా చర్యలు తీసుకోవాలి.
- క్యాబ్ ల మాదిరిగా మహిళల నియంత్రణలో, నిర్వహణలో, మహిళలు డ్రైవర్లుగా ఉండే ఒక యాప్ ను రూపొందించాలి. మహిళల సురక్షిత ప్రయాణానికి సంబంధించిన అన్ని అవసరాలు తీర్చే మాధ్యమంగా ఆ యాప్ పని చేయాలి.
- తెలంగాణలోని అన్ని పాఠశాలలు, కాలేజీల్లో చదివే బాలికలకు, కార్యాలయాల్లో పని చేసే మహిళలకు ఆత్మ రక్షణలో ఉపకరించే కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పించాలి.
- బాలికలకు 1వ తరగతి నుంచే బ్యాడ్ టచ్, కొత్త వారు, అపరిచితులతో ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయంలో అవగాహన కల్పించాలి.
- పోర్న్ సైట్స్ పై నిషేధం విధించాలి
చేపట్టాల్సిన అవగాహన కార్యక్రమాలు
- తెలంగాణలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థల్లో లింగ సమానత్వం, మహిళలు, బాలికల రక్షణకు రూపొందించిన చట్టాలు, వాటిని అతిక్రమిస్తే ఎదురయ్యే పరిణామాలపై వర్క్ షాప్ లు నిర్వహించాలి.
- 1 నుంచి 12 తరగతుల సిలబస్ లో లింగ సమానత్వానికి సంబంధించిన పాఠ్యాంశాలను చేర్చాలి.
6 నుంచి 12 తరగతుల సిలబస్ లో నిర్భయ యాక్ట్, పోక్సో చట్టం, లైంగిక సంబంధిత నేరాల్లో విచారించే తీరు, విధించే శిక్షలకు సంబంధించిన పాఠ్యాంశాలను చేర్చాలి. - డ్రగ్స్, మద్యం, పబ్ లతో చోటు చేసుకునే దుష్పప్రభావాల గురించి యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలి.
- మహిళల భద్రత, లింగ సమానత్వానికి సంబంధించి ఉన్న చట్టాలు, నిబంధనల గురించి విస్తృతం ప్రచారం జరిగేలా యువతను సముహాలుగా విభజించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
- తల్లి తండ్రులు మైనర్ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
విమెన్ ట్రాఫికింగ్ సమస్యపై ఉక్కుపాదం మోపాలి.
మహిళా మంత్రుల సంఖ్య పెంచాలి.
ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించి మహిళలకు భరోసా కల్పించాలి
బాధిత మహిళలు ఉండే విదంగా ప్రభుత్వ షెల్టర్స్ ఏర్పాటు చేయాలి. - ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై, అరాచకాలపై నిరంతర సమీక్ష జరపాలి
- మహిళలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులలో సీసీటీవీ, ఇద్దరు మార్షళ్లను నియమించాలి.
- మహిళా ఉద్యోగులకు రక్షణ భరోసా కల్పించే విధంగా లైంగిక వేధింపు నిరోధక కమిటీలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో ఏర్పాటు చేయాలి.
- మద్యపాన నివారణకోసం ప్రజాచైతన్య ఉద్యమాన్ని చేపడుతాం.
- కాంగ్రెస్ పార్టీ చేపట్టే సత్వర కార్యక్రమాలు
- నిస్సహాయ స్థితిలో లేదా ఎవరూ లేకుండా ఒంటరిగా అసురక్షితమైన ప్రదేశంలో ఉన్న మహిళను భద్రంగా ఇంటికి లేదా గమ్యానికి చేర్చే బాధ్యతను ఎన్ఎస్ఎూఐ, యూత్ కాంగ్రెస్ వాలంటర్లు తీసుకోవాలి. సదరు మహిళకు అవసరమైన రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేయాలి. కఠిన పరీక్ష తర్వాతే ఇటువంటి వాలంటీర్లను ఎంపిక చేస్తాం.
- మహిళలపై అఘాత్యాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరంగా పరిష్కరించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా యూత్ కాంగ్రెస్ నిరంతరం ఆందోళన కార్యక్రమాలను చేపడుతుంది