తెలంగాణలో బలపడుతోందని భావిస్తోన్న బీజేపీలో సైతం గ్రూప్ రాజకీయాలు షురూ అయ్యాయి. ఇన్నాళ్ళు టీఆర్ఎస్ , కాంగ్రెస్ లో మాత్రమే కనిపించిన గ్రూప్ రాజకీయాలు బీజేపీలోనూ బయటపడుతున్నాయి. ఇటీవల కమలం పార్టీలోని ఓ వర్గం నేతలు మాట్లాడుతూ ఆరు నెలల ముందుగానే ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తామని అనౌన్స్ చేయడం గ్రూప్ రాజకీయాలను బహిర్గతం చేసింది.
ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించాల్సింది తానైతే ఇతర నేతలెలా ప్రకటిస్తారని అనుకున్నారో ఏమో కాని ఆ ప్రకటనలను బండి సంజయ్ ఖండించారు. ఇలా ప్రకటనలు చేయడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నాయకులను గందరగోళ పరిచే ప్రకటనలు చేయడం మంచిది కాదంటూ చెప్పుకొచ్చారు.
బీజేపీలో చేరిన ఈటల తన వర్గాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. నియోజకవర్గాల వారిగా కొంత మంది నేతల్ని ఎంకజేర్ చేస్తున్నా ఈతల… టికెట్ విషయంలో మీరేమి హైరానా పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పిస్తున్నారు. ఇది బండి సంజయ్ కు అస్సలు నచ్చడం లేదు. ఈటల దూకుడును అంచనా వేస్తోన్న బండి తన వర్గాన్ని కూడా పెంచుకుంటున్నారు. తన వర్గానికి చెందిన కొంతమంది నేతలను నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పని చేసుకోమంటూ ఆదేశించడం కొత్త చర్చకు దారితీస్తోంది.
మెజార్టీ నియోజకవర్గాల్లో అప్పుడే బీజేపీ అభ్యర్థులు ఖరారు అయ్యారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఓ వర్గానికి చెక్ పెట్టేందుకు ప్రత్యర్ధి వర్గం నేతలు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు టికెట్ పై హామీ ఇస్తూ పార్టీలో పొలిటికల్ హీట్ ను పీక్స్ కు చేరుస్తున్నారు. దీంతో బీజేపీలో అంతర్గత రాజకీయం ముదురి పాకాన పడే అవకాశం ఉందన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.