Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsకేసీఆర్ ను దోషిగా చూపి అధికారంలోకి బీజేపీ- ప్రయత్నాలు ఫలిస్తాయో..?

కేసీఆర్ ను దోషిగా చూపి అధికారంలోకి బీజేపీ- ప్రయత్నాలు ఫలిస్తాయో..?

తెలంగాణలో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తుండటంతో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఓ ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలని భావిస్తోన్న అధినాయకత్వం ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. టీఆర్ఎస్ పాలనలో ఏఏ వర్గాల ప్రజలు నష్టపోయారో వారిని బీజేపీకి దగ్గర చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా దళిత, గిరిజన నియోజకవర్గాలపై రాష్ట్ర నాయకత్వం కన్నేసింది.

రాష్ట్రంలో 19 ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు ఉండగా..12 ఎస్టీ అసెంబ్లీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. దీంతో మొత్తంగా 31అసెంబ్లీ స్థానాలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఈ నియోజకవర్గాల్లో పాగా వేసేందుకుగాను సీనియర్ నాయకులతో ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసే యోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు సమాచారం. ఈ స్థానాల్లో బీజేపీ గెలిచేందుకు ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలనే దానిపై సర్వే కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళిత, గిరిజన సామజిక వర్గాలకు హామీలు ఇచ్చి నెరవేర్చని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. తద్వారా వారిని కమలం పార్టీ వైపు డైవర్ట్ చేయాలని వ్యూహరచన చేస్తోంది. దళితులను సీఎం చేస్తానని హామీ ఇచ్చి విస్మరించారని, మూడెకరాల భూమి ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దళిత బంధు ఇస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేయడం పట్ల టీఆర్ఎస్ పాలనపై ఎస్సీ సామజిక వర్గం ఓటర్లలో వ్యతిరేకత ఏర్పడింది. దీనినే బీజేపీ సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. అలాగే గిరిజనులకు ఇవ్వాల్సిన 10 శాతం రిజర్వేషన్ల హామీని విస్మరించడం, తండాలను గ్రామ పంచాయితీలుగా చేసినా అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోవడం పట్ల ఆ సామజిక వర్గం వారు కూడా కేసీఆర్ పాలనపై ఆగ్రహంగానే ఉన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్ళి దళిత, గిరిజన ఓటర్లకు చేరువ కావాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

రాష్ట్రంలోని 31ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో గెలుపొందేందుకు కేవలం ప్రభుత్వ వ్యతిరేకత పైనే కాకుండా ఆధారపడకుండా.. అక్కడి నుంచి బరిలో నిలిపే బీజేపీ అభ్యర్థుల విషయంలో కూడా దృష్టి సారించింది పార్టీ నాయకత్వం. ప్రజా బలం ఎవరికీ ఎక్కువగా ఉంటుందో వారికీ టికెట్ ఇవ్వాలని చూస్తోంది. ఇందుకోసం పరిశీలకులను కూడా నియమించనుంది. అభ్యర్థుల వేటలో సర్వే చేపట్టి అనేక వడపోతల అనంతరం అభ్యర్థులను ఫైనల్ చేయాలని చూస్తోంది. అనేక అంశాలపై సర్వే నివేదికల అనంతరం ఎన్నికల బరిలో దిగేందుకు బీజేపీ రెడీ అవుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments