మోహన్ బాబుపై కేసు-ఎందుకంటే..?

టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదైంది. గొర్రెల కాపరులను అవమానించారని ఆయనపై కేసు పెట్టారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో గొర్రెలు మేపుకునే వాడి దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని… గొర్రె కాపరులను చులకన చేసి మాట్లాడారని వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసు పెట్టారు.

ఆత్మగౌరవంపై దాడి చేస్తే ఊరుకునే లేదని, ఎంతటి వారితో అయినా పోరాడతామని తెలిపారు గొర్రె కాపరులు. మోహన్ బాబు తక్షణమే గొర్రెల కాపరులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అతనిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని బూర్గంపాడు పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.