Monday, April 4, 2022
HomePoliticsసీబీఐ మాజీ జేడీ ప్రయాణమెటు..? టీడీపీలోకా..? జనసేనలోకా..?

సీబీఐ మాజీ జేడీ ప్రయాణమెటు..? టీడీపీలోకా..? జనసేనలోకా..?




వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ గురించి ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన లక్ష్మి నారాయణ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది మాత్రం చెప్పలేదు. దీంతో ఆయన పోటీ చేస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా..? లేక ఏదైనా పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారా అన్నది..? బిగ్ డిబేట్ గా మారింది.

గత ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మి నారాయణ ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన జనసేనకు రాజీనామా చేసి తన స్వచ్చంద సంస్థ పేరిట సహయక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓ పార్టీకి అద్యక్షుడిగా కొనసాగుతూ ప్రజా సమస్యలను వదిలేసి సినిమాల్లో నటించడం సరికాదంటూ పవన్ కళ్యాణ్ నిర్ణయంతో విబేధించి జనసేన నుంచి తప్పుకున్నారు.

ఇటీవల జనసేన తీసుకుంటున్న నిర్ణయాలను లక్ష్మి నారాయణ సమర్ధిస్తున్నారు. దీంతో ఆయన మళ్ళీ మాతృ సంస్థలో చేరుతారా..?అనే చర్చ జరుగుతోంది. జనసేన కాదనుకుంటే ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ భావజాలం కల్గిన లక్ష్మి నారాయణ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోన్నా..ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని విస్మరించిన ఆ పార్టీలో చేరే అవకాశం లేదని అంటున్నారు.

ఇక, గతంలో ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఆయన స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. వైసీపీలో చేరేది లేదని ఖరాఖండిగా చెప్పిన సంగతి తెలిసిందే.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments