Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsబీజేపీ, టీఆర్ఎస్ లకు చెక్ - రేవంత్ భారీ స్కెచ్..!

బీజేపీ, టీఆర్ఎస్ లకు చెక్ – రేవంత్ భారీ స్కెచ్..!

తెలంగాణ కాంగ్రెస్ ను అస్సలు రేసులోనే లేదన్నట్లుగా బీజేపీ, టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా సీన్ క్రియేట్ చేస్తున్నాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ పాడిందే పాట అన్నట్లుగా ఇదే డైలాగ్ నొక్కి మరీ చెప్తోంది. కమలం అగ్రనేతలను రాష్ట్రానికి ఆహ్వానించి..కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని కాషాయ పార్టీ వైపు మళ్లించుకుంటుంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం.

ఇదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రాష్ట్రాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఓ వైపు వరుసగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తూ కమలం కాంపౌండ్ లో కొత్త జోష్ నింపుతుంటే కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మ స్తైర్యం దెబ్బతింటుంది. పైగా పార్టీలోని కీలక నేతలు కూడా ఇష్టారీతిన వ్యవహరిస్తూ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ కు ఈ పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. పీసీసీ బాధ్యతలను రేవంత్ చేపట్టిన తరువాత కాంగ్రెస్ మంచి ఊపులో కనిపించింది. రేవంత్ దూకుడు చూసిన కేసీఆర్ వ్యూహాత్మక రాజకీయాలకు పదును పెట్టారు. తమకు ప్రత్యామ్నాయంగా బీజేపీ అయిన అంగీకరిస్తాను కాని కాంగ్రెస్ ను అస్సలు అంగీకరించననే రీతిలో రాజకీయాలను మార్చేస్తున్నారు. దీంతో కేసీఆర్ కు దీటుగా రేవంత్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న పార్టీ కార్యకర్తలకు ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తామని న్యూ ఇండియా ఇన్సురెన్స్ కంపెనీతో రేవంత్ అంగీకారం కుదుర్చుకున్నారు. అలాగే ముందుగా ప్రకటించిన విధంగానే 30 లక్షల సభ్యత్వాలను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మొదటగా జనవరి 26 వరకు పార్టీ సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించినా ఆ సమయాన్ని పొడిగించారు రేవంత్. కరోనా కారణంగా గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు 7 లక్షల పైగా సభ్యత్వాలు పూర్తి అయ్యాయి. మార్చి వరకు గడువును పొడిగించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి బూత్ నుంచి 100 మంది సభ్యత్వం పూర్తి చేయాలి. కాంగ్రెస్ సభ్యత్వం పొందిన వారికీ రెండు లక్షల ప్రమాద భీమా వర్తిస్తోంది. మండల స్థాయిలో పదివేలు,నియోజకవర్గ స్థాయిలో యాభై వేలు ,లోక్ సభ స్థానంలో మూడున్నర లక్షల సభ్యత్వాలు నమోదు చేయించిన వారికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని ప్రకటించారు. రేవంత్ చేసిన ఈ ప్రకటనతో పార్టీ శ్రేణులు కొత్త ఊపుతో సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయంతో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments