Saturday, January 22, 2022
HomeMovieజగన్ తో చిరంజీవి భేటీ- గుడ్ న్యూస్ చెప్తారా..?

జగన్ తో చిరంజీవి భేటీ- గుడ్ న్యూస్ చెప్తారా..?

ఏపీలో సినిమా టికెట్ ధరలపై టాలీవుడ్ వర్సెస్ వైసీపీ సర్కార్ అన్నట్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్న సమయంలో ఇద్దరు సమావేశం కానున్నారు. ఈ భేటీలో సినిమా టికెట్ ధరలపై కొనసాగుతున్న వివాదంపై చర్చించే అవకాశం ఉంది.

మెగాస్టార్ చిరంజీవి ఏపీ సర్కార్ తో భేటీ కానుండటంతో చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఈ భేటీని గమనిస్తోంది. ఈ సమావేశం ద్వారా ఏపీ సర్కార్ ను చిరు ఒప్పించి, మెప్పించి సానుకూల ప్రకటన వచ్చేలా ఏమైనా ఒత్తిడి తేస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజంగా చిత్ర పరిశ్రమ ఊహించినట్టుగానే చిరు గుడ్ న్యూస్ తో బయటకు వచ్చి సంక్రాంతి జోష్ ను నింపుతారేమో చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments