గిరిజ‌నుల ఉద్య‌మం ఎఫెక్ట్-రంగంలోకి కేసీఆర్

రాష్ట్రంలో పోడు భూముల కోసం గిరిజ‌నులు ఎంతో కాలంగా పోరాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోడు రైతుల‌కు ప‌ట్టాలిస్తామ‌ని కేసీఆర్ చెప్పినా, పోడు రైతుల‌ను ఇబ్బంది పెట్టొద్ద‌ని ఆదేశించినా దాడులు ఆగ‌టం లేదు. దీంతో గిరిజ‌న సంఘాలు, ప్ర‌తిప‌క్ష నేత‌లు నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు. ఇటు టీఆర్ఎస్ నేత‌లు సైతం ప్ర‌భుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు.

తాజాగా దీనిపై సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసేందుకు రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది. పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరిత హారం ప్రధాన అంశాలుగా చర్చించేందుకు ఈ నెల 23న జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. ఏ జిల్లాల్లో ఎంత పోడు వ్య‌వ‌సాయం జ‌రుగుతుంది, ఎక్క‌డ ఇబ్బందులున్నాయ‌న్న అంశాల‌పై మూడు రోజుల పాటు అట‌వీ శాఖ అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆ త‌ర్వాతే ఈ ఉన్న‌త స్థాయి సమీక్ష స‌మావేశం ఏర్పాటు చేశారు.

ఈ మీటింగ్ లో పోడు భూముల ప‌ట్టాలు, కొత్త‌గా అడ‌వుల ప‌రిర‌క్ష‌ణ అంశాలపై చ‌ర్చించ‌నున్నారు.