ఇండియాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. నిపుణులు హెచ్చరించినట్లుగానే మరికొన్ని రోజుల్లోనే దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభం కానుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫ్రంట్ లైన్ వర్కర్స్ ను కూడా కరోనా వదలడం లేదు. తాజగా దేశ రాజధాని ఢిల్లీలో దాదాపుగా వేయి మంది పోలీసులు కరోనా బారిన పడినట్లు తెలిపారు అధికారులు. దీంతో వారంతా హోం ఐసోలేషన్ లో ఉంటున్నారని చెప్పారు. కరోనా కట్టడికి ఢిల్లీ సర్కార్ చర్యలు తీసుకుంటున్న కేసుల సంఖ్య పెరగడంపై ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది.