బ్రేకింగ్- చిన్నారుల‌కు సైతం క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చేసిందోచ్!

క‌రోనా వైర‌స్ జ‌నాన్ని ఎలా గ‌డ‌గ‌డ‌లాడించిందో అంద‌రికీ తెలిసిందే. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా గ‌జ‌గ‌జ వ‌ణికించింది. అయితే, పెద్ద వారికి ఇప్ప‌టికే క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా…తాజాగా ఇండియాలో చిన్నారుల‌కు సైతం వ్యాక్సిన్ వ‌చ్చేసింది.

CISF Takes Over Security Of Covaxin Manufacturer Bharat Biotech's Hyderabad  Campus

ఇప్ప‌టి వ‌ర‌కు 18 ఏళ్ల పైబ‌డిన వారికి మాత్ర‌మే వ్యాక్సిన్ అందుబాటులో ఉండ‌గా, ఇక నుండి 2-18ఏళ్ల మ‌ధ్య వారికి సైతం కోవాగ్జిన్ ఇవ్వొచ్చ‌ని భార‌త డ్ర‌గ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమ‌తిచ్చింది. ఇప్ప‌టికే పూర్తైన మూడు ద‌శ‌ల ప్ర‌యోగాల డేటా విశ్లేష‌ణ త‌ర్వాత ఈ మేర‌కు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది. త్వ‌ర‌లోనే కోవాగ్జిన్ పిల్ల‌ల‌కు అందుబాటులోకి రానుంది.

కోవాగ్జిన్ ను ఇర‌వై రోజుల వ్య‌వ‌ధిలో రెండు డోసులు పిల్ల‌ల‌కు ఇవ్వ‌నున్నారు. దీనిపై కేంద్రం త్వ‌ర‌లోనే గైడ్ లైన్స్ ఇవ్వ‌నుంది.

అయితే, కోవాగ్జిన్ ను ఇండియా స‌హా చాలా దేశాల్లో ఇప్ప‌టికే అనుమ‌తించిన‌ప్ప‌టికీ… ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మాత్రం కోవాగ్జిన్ ను ఇంకా అధికారికంగా గుర్తించ‌లేదు.