Sunday, June 19, 2022
HomePoliticsLatest Newsదేశభక్తిని సైతం కాంట్రాక్ట్ మాయం చేస్తున్నారా..?

దేశభక్తిని సైతం కాంట్రాక్ట్ మాయం చేస్తున్నారా..?




ఇన్నాళ్ళు దేశభక్తి ప్రధాన ఎజెండాగా సెంటిమెంట్ ను రగిల్చి అధికారపీఠంలో కొనసాగుతోన్న బీజేపీ… అగ్నిపధ్ తో దేశభక్తిని కూడా కాంట్రాక్ట్ మాయం చేస్తోందన్న విమర్శలు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ఇతర దేశాల్లో అగ్నిపథ్ విధానం కొనసాగుతుందని మన దేశంలోనూ అదే విధానం ప్రవేశపెడుతున్నామని కేంద్రం చెబుతోంది. విదేశాల్లో ఉన్న నిబంధనలను మన దేశంలో అమలు చేయాలన్న నిబంధనమి లేదు. అసలు పాశ్చాత్య దేశాల వాసనను సైతం ఇష్టపడని బీజేపీ.. ఇతర దేశాలలోని సైనికదళ రిక్రూట్ మెంట్ విధానం మన దేశంలోనూ అమలు చేస్తామని చెప్పడాన్ని అందరూ తప్పుబడుతున్నారు.

ఆర్మీలో నాలుగేళ్లపాటు దేశానికి సేవలు అందించిన తరువాత 75శాతం మందిని ఇంటికి పంపించి, మిగతా 25శాతం మందిని మాత్రమే సర్వీసులో కంటిన్యూ చేస్తామని కేంద్రం అంటోంది.ఈ 75 శాతం మందిని ఒట్టి చేతులతో ఇంటికి పంపమని నాలుగేళ్ల తర్వాత 11లక్షల 71 వేల రూపాయల సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుందని చెబుతోంది. కాని నాలుగేళ్ల తరువాత తాము మళ్ళీ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాల్నా అని ఉద్యోగార్థులు ప్రశ్నిస్తున్నారు. అసలు దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఆర్మీ విభాగంలో కాంట్రాక్ట్ విధానం కొనసాగించడం ఏంటని కేంద్ర సర్కార్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా అగ్నిపథ్ పై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. సడెన్ గా ఆర్మీ రిక్రూట్ మెంట్ పాత విధానం రద్దు చేస్తున్నామని ప్రకటించేసి.. కొత్తగా అగ్నిపథ్ ద్వారా నియామకాలు ఉంటాయని చెప్పడంతో ఆర్మీ ఉద్యోగార్థులు రోడ్డెక్కారు. విధ్వంసం సృష్టించారు. ఫలితం భారీ ఆస్థి నష్టం. పాత విధానం ఎందుకు వద్దో కేంద్రం చెప్పడం లేదు. కొత్త విధానం ద్వారా జరిగే మంచెంటో అర్థమైయ్యేలా అవగాహనా కల్పించడం లేదు. ఇవన్నీ చక్కదిద్దకుండానే అగ్నిపథ్ ను తీసుకొచ్చి యువతను నైరశ్యంలోకి నెట్టేసింది. రెండేళ్ళుగా ఆర్మీలో చేరాలనుకున్న తమ కల త్వరలోనే సాకారం అవుతుందని భావిస్తుండగా.. తమ ఆశలపై అగ్నిపథ్ నీళ్ళు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments