Wednesday, April 13, 2022
HomePoliticsLatest Newsరెండో పెండ్లి చేసుకున్న క్రికెట‌ర్లు తెలుసా..?

రెండో పెండ్లి చేసుకున్న క్రికెట‌ర్లు తెలుసా..?




పెళ్ళిళ్ళు చేసుకోవడం మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోవడం చకచక జరిగిపోతుంది. ఈ సంప్రదాయం సినీ ఇండస్ట్రీలో కనిపించినా ఇందుకు క్రికెట్ మినహాయింపేమి కాదు. భార్యలకు విడాకులు ఇచ్చిన క్రికెటర్లు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

అజరుద్దీన్

టీమిండియా మాజీ సారధి అజారుద్దీన్ మొద‌ట‌గా నౌరీన్ ను పెండ్లి చేసుకుని విడిపోయారు. తిరిగి 1996 లో సంగీతా బిజ్లానీని పెండ్లి చేసుకున్నాడు.

జవగళ్ శ్రీనాథ్

జవగళ్ శ్రీనాథ్ మొదట జోత్స్నా తో పెండ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఇద్దరూ విడిపోయారు. దీంతో మాధవి అనే జర్నలిస్ట్ ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

వినోద్ కాంబ్లి

టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి తన చిన్ననాటి స్నేహితురాలు నోయెల్లా లూయిస్ ను మ్యారేజ్ చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల తలెత్తడంతో విడిపోయారు. మోడల్ ఆంద్రియాని రెండో పెళ్లి చేసుకున్నాడు.

దినేష్ కార్తీక్

ట్యాలెంట్ మెండుగా ఉన్నప్పటికీ నిలకడలేని ప్రదర్శనతో టీమిండియాలో స్థానం కోల్పోయాడు దినేష్ కార్తీక్. ఈయన తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితను పెళ్లి చేసుకున్నాడు. కాని నిఖిత మరో క్రికెటర్ మురళి విజయ్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో దినేష్ కార్తీకు ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తరువాత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత నిఖిత‌, మురళి విజయ్ లు పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

శిఖర్ ధావన్


మొదటి భార్యతో విడిపోయిన శిఖర్ ధావన్ నటి అయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. కాని ఇటీవల వీరిద్దరూ విడిపోయారు.

మహ్మద్ షమీ

చీర్ లీడర్ హసీన్ జహాన్ ను పెళ్లి చేసుకున్నాడు. కాని ఇద్దరి మధ్య తరుచుగా గొడవలు జరగడంతో వేర్వేరుగా ఉంటున్నారు. వీరి విడాకుల వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది.

సనత్ జయసూర్య


శ్రీలంక వెటరన్ ప్లేయర్ జయసూర్య సుముధు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాని మనస్పర్ధలు రావడంతో పెళ్ళైన ఏడాదికి విడిపోయారు. ఆ తరువాత సాండ్రాని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆమెతో 20ఏండ్ల కాపురం త‌ర్వాత 2021లో విడాకులు తీసుకున్నాడు.

షోయబ్ మాలిక్

పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మొదటగా అయేషా సిద్ధిఖీ అనే అమ్మాయిని వివాహం చేసుకుని విడిపోయారు. ఆ త‌ర్వాత భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జాని వివాహం చేసుకున్నాడు.

బ్రెట్ లీ

ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్ బ్రెట్ లీ 2006లో ఎలిజబెత్ ను మ్యారేజ్ చేసుకున్నాడు.ఆమెతో విడాకులు తీసుకొని 2014లో లానా అండర్సన్ తో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments