మహారాష్ట్ర సర్కార్ కుప్పకూలనుందా? షిండే మళ్లీ తన మార్క్ రాజకీయాన్ని బయటకు తీయనున్నారా? అంటే అవుననే హెచ్చరికలు చేశారు ఎక్ నాథ్ షిండే.
మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో విబేధాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తేలికగా తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. 2022లో తనను లైట్ తీసుకున్న శివసేన థాక్రే సర్కార్ ను కూల్చానని.. ఇప్పుడు తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మళ్లీ మునుపటి షిండేను చూస్తారనే తరహాలో బీజేపీకి హెచ్చరికలు చేశారు.
2024లో మహాయుతి కూటమి నెగ్గడంతో సీఎం పదవిని షిండే ఆశించారు కానీ, దక్కలేదు.బీజేపీ తన మాతృ సంస్థకు అత్యంత సన్నిహితుడు అయిన దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎంగా ఎంపిక చేసింది. మోడీ సూచనతో మెత్తబడి ఇప్పుడు ఘీంకరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నిర్ణయాన్ని సవాల్ చేస్తే షిండేకూ తెలుసు.అందుకే సైలెంట్ గా తను కోరుకున్న శాఖను కేటాయించకపోయినా..కాదనకుండా స్వీకరించారు. ఇప్పుడు భీకరమైన ప్రకటనలు చేస్తున్నారు. దీన్ని బట్టి ఫడ్నవీస్ కు, షిండేకు ఎక్కడో బెడిసినట్టే ఉంది.
కానీ, ఈ బెదిరింపులకు ప్రస్తుతం బీజేపీ భయపడే పరిస్థితి లేదు. ప్రభుత్వాన్ని కూల్చుతే తర్వాతి పర్యవసానాలు ఎలా ఉంటాయో షిండేకు ఎవరూ చెప్పాల్సిన పనిలేదేమో.