Friday, January 21, 2022
HomePoliticsLatest Newsవైఎస్ షర్మిల కు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్

వైఎస్ షర్మిల కు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్

ఏపీలోనూ పార్టీని విస్తరించాలని భావిస్తోన్న వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం ఊరటను ఇచ్చే వార్తను  చెప్పింది.పార్టీ పేరును మార్చాలని ఈసీ ప్రతిపాదించాడం ఓ రకంగా గుడ్ న్యూసేనని అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో ఆమె ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళలేని పరిస్థితి. దాంతో ఏం చేయాలన్న దానిపై కొన్ని రోజులుగా షర్మిల అనేక సమాలోచనలు చేస్తున్నారు. ఏ క్రమంలోనే పార్టీ పేరు పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వైఎస్సార్ టీపీ పేరును పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయలేదని పేర్కొంది ఈసీ. ఇతర పేర్లను ప్రతిపాదించాలని ఎన్నికల సంఘం కోరింది. పార్టీ పేరు ఇంకా రిజిస్టర్ కాకపోవడంతో పార్టీని రెండు ప్రాంతాల్లో విస్తరించేలా నామకరణం చేయాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది.

వైఎస్సార్ అనే పేరును ఉపయోగించుకునే అంశంపై అన్న వైఎస్సార్ పార్టీ నుంచి షర్మిల ఏర్పాటు చేసిన వైఎస్సార్ టీపీ పై అభ్యంతరం వ్యక్తం అయ్యాయి. దాంతో ఆమె స్థాపించిన పార్టీని రిజిస్టర్ చేయలేదని తెలుస్తోంది. గతంలో జగన్ వైఎస్సార్ సీపీని ఏర్పాటు చేసిన కాలంలోనూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వైఎస్సార్ సీపీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా వాడుకోవాలని అన్న వైఎస్సార్ పార్టీ అద్యక్షుడు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాడు. తాజాగా షర్మిల పార్టీ పేరుపైనా ఆయన ఫిర్యాదు చేశారు. దాంతో ఇతర పేర్లను సూచించాలని షర్మిలకు ఈసీ లేఖ రాసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఏపీ , తెలంగాణలో పార్టీ ఉనికిలో ఉండేలా పేరును ప్రతిపాదించే అవకాశం ఉందని టాక్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments