Wednesday, April 13, 2022
HomeOpinionజార్జిరెడ్డి 50వ వర్ధంతి స్పెషల్ - సినిమా ప్రభావం౼పరిచయాలు

జార్జిరెడ్డి 50వ వర్ధంతి స్పెషల్ – సినిమా ప్రభావం౼పరిచయాలు
ఎప్పటిలాగే ఏప్రిల్ 14 జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఓయూలో మార్నింగ్ వాక్ ముగించుకొని జిల్లా కమిటిగా జార్జి స్తూపం వద్ద నివాళులు అర్పించడం ఆనవాయితీగా జరుగుతుంది.ఇప్పుడు అంతే కొనసాగింపు..!మేమంతా మా కామ్రేడ్స్ అంత వచ్చారా.?లేదా..?అంటూ వచ్చేవాళ్ల కోసం ఎదురుచూస్తున్నాం.ముఖ్యంగా నాకు జార్జి వర్ధంతికి సరిగ్గా 2 రోజుల ముందు పరిచయమైన సుమంత్ (హోటల్ మేనేజమెంట్) బబ్లూ (ఎంబీఏ)ల కోసం చూస్తున్నా కానీ వాళ్ళిద్దరితో పాటు మూడో వ్యక్తీ రోజా పూల దండ తీసుకొని వస్తుండు.కానీ నేను అప్పటికే ఒక పూల దండ తీసుకొచ్చాను.వాళ్ళకి దండ తీసుకరండని చెప్పలేదు.మంచి చైతన్యమనుకున్నాం.ఆ ముగ్గురు కల్సిరావడం కారణంగా వాళ్లంతా ఫ్రెండ్స్ అనుకున్నాం.అప్పటికే ఎండమండుతుంది.ఇంకోవైపు పక్కనే ఎవరో చనిపోయారు.ఆ కార్యక్రమం చాలా మందితో పాస్టర్ ప్రార్థనలతో, బంధుమిత్రులు ఏడుపులతో కొనసాగుతుంది.

ఇంకా మా కార్యక్రమం ప్రారంభించి ఒక్కొక్కరూగా మాట్లాడి నివాళులు అర్పించాం. ముగించాం.ఇంకా నిష్క్రమిస్తున్నాం. కానీ ఆ దండ తీసుకొచ్చిన తమ్ముడిని చూసి ముచ్చటేసింది, పరిచయం చేసుకోవాలనే ఆతృత.వెంటనే సుమంత్ ని, బబ్లూ ని అడిగాను తెలియదంటూ సమాధానం ఇచ్చారు.అవునా !మరి తాను ఎవరూ.? మరింత ఆశ్చర్యం, సంతోషంగా అనిపించింది.స్వయంగా నేనే వెళ్ళి నా పేరు, స్టడీ చెప్పి కరచాలనం అందించాను.ఒకరకంగా నేను గొప్ప సంబ్రమాశ్చర్యానికి గురేయ్యంతగా తన సమాధానాలు ఉన్నాయి…నాకు మీరెవరూ తెలీదు.

జార్జిరెడ్డి సినిమా చూసి You tube, Google ల్లో సెర్చ్ చేసి, ఆర్టికల్స్ చదివి తన వర్ధంతి రోజు స్థూపం వద్ద నివాళులు అర్పించాలని దిల్ సుఖ్ నగర్ నుంచి వచ్చానన్నాడు. తానే రోజా పులా దండతో వచ్చిన రాము (మిర్యాలగూడ పక్కన ఊరు) దిల్ సుఖ్ నగర్ లో ఉంటూ ప్రిపేర్ అవుతున్నాడు. జార్జి వర్ధంతి కోసం నవంబర్ నుంచి ఎదురుచూస్తున్నా ఇంకొకరూ అర్జున్ (దేవరకొండ) దోమల్ గూడలో ఉంటూ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఉదయం జార్జి స్మృతిలో జరిగిన మార్నింగ్ వాక్ లో మాతో కల్సి నడిచాడు.అప్పుడంతగా పరిశీలించలేదు నేను. స్తూపం దగ్గర మాట్లాడి అందరం వెళ్తుండగా నేను రాముతో మాట్లాడుతుండగా నా దగ్గరికి వచ్చి బాగా మాట్లాడవ్ అన్న అంటూ పరిచయం చేసుకున్నాడు. తాను కూడా అంతే msc సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లో చదువుకున్నప్పటికి జార్జి గూర్చి అంతగా తెలియదంటా, జార్జిరెడ్డి సినిమా చూసి జార్జి గూర్చి సెర్చ్ చేసి జార్జి అభిమాని అయ్యడంటా. నేను వీళ్లిద్దరితో మాట్లాడుతుండగా మా వాళ్లు అంత వెళ్లారు.ఆ తర్వాత రాము కూడా వర్క్ ఉందన్న మళ్ళీ కలుద్దాం అంటూ వెళ్ళాడు. చివరిగా నేను, సుమంత్, అర్జున్, బబ్లూ ఉన్నాం.

ఆశ్చర్యకర పరిచయాన్ని అంత ఈజీగా వదులుకొము కదా .. YMCA లో ఛాయ్ తాగుతూ చాలా సేపు మాట్లాడి మళ్ళీ కలుద్దాం అంటూ లేచాం. అర్జున్ ప్రేమతో నన్ను దగ్గర్లోనే ఉన్న దోమల్ గూడ వాళ్ళ రూంకి ఆహ్వానించాడు.వెళ్ళాను.మా చాయ్ డిస్కషన్లో భాగంగా సుమంత్ నేను లంచ్ చేసి మళ్ళీ స్తూపం వద్దకి వద్దాం. మనకి ఎ మాత్రం పరిచయం లేకుండా.. ఇలా జార్జి పై ప్రేమ అభిమానంతో ఎంతమంది వస్తారో చూద్దాం అనుకున్నాం కానీ సుమంత్ కి కుదరలేదు.. నేను ఒక్కడినే మళ్ళీ వెళ్ళాను కొంత టైం అయ్యాక హర్షిత (నల్గొండ) క్రిమినల్ అడ్వొకేట్ lb నగర్ లో ఉంటుంది, సమాజం పట్ల తనకున్నా బాద్యత కారణంగా సమకాలీన విషయాలు,అంశాలు తెలుసుకుంటూ ఆలోచిస్తుంది, అసలు సినిమాలే చూడని తాను జార్జిరెడ్డి సినిమా చూసి సెర్చ్ చేసి స్ఫూర్తి పొందింది.

ఇంకోరు ఉదయ్ (ఆమన్ గల్ ) తాను అంతే !జార్జి పరిచయం సినిమాతో ప్రారంభమయ్యింది.విద్యార్థిగా ఉండాల్సిన బాధ్యత గుర్తుచేసింది.ఇంకా స్టూడెంట్స్ కానీ ఇద్దరు పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్లపై కూడా జార్జి ప్రభావం ఉంది. గొప్ప మేధావిని కోల్పోవడం మనందరి దృదృష్టం. బాధాకరమన్నారు. ఇప్పుడే కాదు. జార్జిరెడ్డి సినిమా విడుదలైన కొత్తలో అంతే. చాలా మంది జార్జి నిలిచి, పోరాడి, గెలిచిన ఓయూను చూడాల్సిందే అంటూ వచ్చారు. అందులో విజయ మేడం (ఆంధ్ర)తిరుపతి నుంచి పనికట్టుకొని ఓయూ కి వచ్చి నాతో, అనిల్ తో మాట్లాడి వాళ్ళ అబ్బాయిని మాకు పరిచయం చేపించింది. జార్జి గూర్చి మాతో మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురైంది. మరొకరూ రతిష్ (కేరళ) జార్జి ప్రభావం తనపై ఎలా ఉందండే జార్జి జయంతి జనవరి 15 నాడు కేరళలోని కొల్లమ్ పట్టణంలో అనాథలకు బట్టలు పంపిణీ చేసేంతగా !!

మొన్న ఓయూ మార్నింగ్ వాక్ వస్తా అన్నాడు నేనె వచ్చే సంవత్సరం 50వ వర్ధంతికి గ్రాండ్ గా ఓయూ లో కలుద్దామన్నాను..ఇంకా జార్జి ప్రభావానికి గురై, మాకు పరిచయం కానీ వాళ్ళెంతో మంది ఉన్నారంటే అతిశయోక్తి లేదు..మరి జార్జిరెడ్డి సినిమా రాకముందు జార్జి స్పూర్తితో ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్లు లేరా అంటే ఉన్నారు. కేవలం జార్జి స్పూర్తితో సకల సౌకర్యవంతమైన జీవితాన్ని త్యజించి అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ నేటికీ విప్లవోద్యమంలో కొనసాగుతున్నావారున్నారు. వారందరూ ఆ రోజుల్లో ఉద్యమాల్లోకి రావడానికి రాష్ట్ర, దేశ ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాల హోరు, జోరు, భౌతిక పరిస్థితులు ఉత్ప్రేరకాలు. కానీ నాటికి నేటికి పరిస్థితులు మారాయి. కానీ దోపిడీ, పీడన, అణచివేత, అసమానతలున్నాయి. ఇంకొరకంగా విస్తృతమయ్యాయి. కానీ రూపాలు మారాయి. నిశిథిస్తే తప్ప అర్ధం కాదు..

ఆశాస్త్రియత,అశ్లీలత, పబ్ , మబ్బు, మత్తు కల్చర్ విద్యార్థి ,యువతను వెంటాడుతూ పెడదోవ పట్టిస్తున్నా ప్రస్తుత పరిస్థితుల్లో మార్కుల సంపాదన, ఉద్యోగవేటనే జీవితమని భ్రమింపజేసే సంస్కృతి విస్తృతమవుతున్న సందర్భంలో నేటి విద్యార్థులను తన వైపు జార్జి కదిలిస్తుందంటే జార్జి అధ్యయనం, ఆచరణ, పోరాటం, జీవితం ఒకేత్తైతే మెజార్టీ విద్యార్థి,యువత ఉన్న సోషల్ మీడియా, విజువల్ ఎఫెక్ట్ రంగాల్లో జార్జి బింబం ప్రసారమవడం ఒకెత్తుగా భావించవచ్చును. అందుకే ముందుగా మన మడికట్టు టర్మీనాలజీ కొంత సరళీకరించి, అకడమిక్ చదువుల్లో ఉంటూ నాన్ అకడమిక్ ను విస్తృత అధ్యయనం చేస్తూ సోషల్ మీడియా, విజువల్ ఎఫెక్ట్ రంగాల్లోనూ మనముంటూ దిశానిర్దేశం చెయ్యాల్సిన ఆవశ్యకత నేడు నెలకొనివుంది.

50 సంవత్సరాల తర్వాత కూడా జార్జ్ జీవితం – మరణం ప్రభావం చూపుతూనే ఉంది. అది శ్రీశ్రీ చెప్పినట్లు కొంత మంది కుర్రవాళ్ళను పావన నవ జీవన బృందా వన నిర్మాతలు గా తీర్చిదిద్దుతుంది. జార్జి ను తలచుకోవటం అంటే సమాజ హితాన్ని కోరుకోవడమే. ఇవ్వాలా పరిచయమైన ఈ కొత్త మిత్రులు నూతన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తున్న,జార్జి నిర్మించిన ప్రగతిశీల విద్యార్థి ఉద్యమంలో తో కలిసి నడుస్తూ జార్జి ఆశయాల వెలుగులో కొనసాగాలని కొనసాగుతారని మనసారా కోరుకుంటున్నాను.

విప్లవాభివందనాలతో
గడ్డం శ్యామ్
Msc, Bed,Mcj
PDSU ప్రధాన కార్యదర్శి

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments