Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsవ్యాక్సిన్ మహిమ - టీకా వేయగానే...

వ్యాక్సిన్ మహిమ – టీకా వేయగానే…

కరోనా వ్యాక్సిన్ వండర్ ను క్రియేట్ చేసింది. పెరాలసిస్ వచ్చిన వ్యక్తి శరీరంలో కదలిక తీసుకురావడంతోపాటు మాటలు వచ్చేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..55ఏళ్ల ఓ వ్యక్తి ఐదేళ్ళ కిందట రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాడు. తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. సర్జరీ చేసిన వైద్యులు అతని ప్రాణాలను కాపాడారు. కాని కొంతకాలానికే అతనికి పెరాలసిస్ వచ్చి మంచం పట్టాడు.

ఎటు కదల్లేక , తన బాధను ఎవరికీ చెప్పుకోలేక చిత్ర వధ అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ వేయించారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పడంతో మొదట్లో అందుకు అతను సంకోచించాడు. కాని తరువాత అంగన్ వాడీ కార్యకర్తలు వచ్చి అతనికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు. ఆ తరువాత ఏమైందో ఏమో కాని అతని శరీరంలో కదలికలతోపాటు నోటి వెంట మాటలు ఊటాల జాలువారాయి. దాంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయాన్నీ సర్పంచ్ సుమిత్రా దేవి స్వయంగా తెలిపారు. ఈ నెల 4న వ్యాక్సిన్ వేసిన నాటి నుంచే అతని శరీరంలో కదలికలు వచ్చుయని చెప్పారు.

ఆ వండర్ జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లా పెతర్వార్ మండలం సల్గాడి గ్రామంలో చోటుచేసుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments