Monday, April 4, 2022
HomePoliticsLatest Newsఉప్పల్ టీఆరెస్ లో గ్రూపులు -అయోమయంలో క్యాడర్

ఉప్పల్ టీఆరెస్ లో గ్రూపులు -అయోమయంలో క్యాడర్




ఉప్పల్ టీఆరెస్ లో గ్రూప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి ఉప్పల్ నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నుంచి పోటు ఎక్కువైంది.

ముందస్తు ఎన్నికల హడావిడి లేక ఇప్పటి నుంచే గెలుపు వ్యూహాలను రచించాలనో ఏమో కాని బొంతు రామ్మోహన్ నియోజకవర్గంలో స్పీడ్ పెంచడం చర్చనీయంశంగా మారింది. ఎమ్మెల్యే కు సమానంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానికంగా పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు బొంతు రామ్మోహన్.

మంత్రి కేటీఆర్ కు సన్నిహిత నేత రామ్మోహన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉండటంతో రకరకాల చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై కేటీఆర్ నుంచి బొంతు రామ్మోహన్ కు స్పష్టమైన హామీ రావడంతోనే ఆయన పర్యటనల్లో స్పీడ్ పెంచారనే టాక్ కూడా వినిపిస్తోంది.

బొంతు రామ్మోహన్ వరుస పర్యటనలపై బేతి సుభాష్ రెడ్డి వర్గం గుర్రుగా ఉంది. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా పర్యటనలు చేస్తుండటంపై ఆగ్రహంగా ఉన్నారు. నియోజకవర్గంలో బొంతు రామ్మోహన్ గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. బొంతు రామ్మోహన్ పై ఫిర్యాదు చేయాలని బేతి సుభాష్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు, అటు బొంతు రామ్మోహన్, ఇటు బేతి సుభాష్ రెడ్డిల మధ్య వర్గపోరు క్రమంగా ముదురుతుండటంతో ఉప్పల్ నియోజకవర్గ టీఆర్ఎస్ క్యాడర్ లో నిస్తేజం కనిపిస్తోంది. న్యూట్రల్ గా వ్యవహరించే నేతలు సైతం ఎవరికి మద్దతుగా కార్యక్రమాల్లో పాల్గోనాలో అర్థం అవ్వక గందరగోళానికి గురి అవుతున్నారు.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments