Saturday, January 22, 2022
HomeMovieజనసేనలో చేరుతా-హైపర్ ఆది

జనసేనలో చేరుతా-హైపర్ ఆది

హైపర్ ఆది.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ కామెడి షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది తన పంచ్ కామెడి కౌంటర్ లతో అనతికాలంలోనే మంచీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. జబర్దస్త్ తో వచ్చిన గుర్తింపుతో ఆదికి పలు షో లతోపాటు సినిమాల్లోనూ వరుసపెట్టి అవకాశాలు వస్తున్నాయి.

ఇక, హైపర్ ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పాడు. పవన్ పై ఎవరైనా నోరు పారేసుకుంటే హైపర్ ఆది కౌంటర్ లు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు తానెప్పుడు మద్దతుగా ఉంటానని.. జనసేన పార్టీకి ఎన్నికల సమయంలో క్యాంపెయిన్ కూడా చేశానని అన్నారు.

భవిష్యత్ లో రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచన వస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీలోనే చేరుతానని స్పష్టం చేశాడు ఆది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments