దుబాయ్ వేదికగా టీ -20ప్రపంచ కప్ రెండో సెమి ఫైనల్ లో పాకిస్థాన్ – ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాక్ కు మద్దతు తెలపడంపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇండియా ఉప్పు తింటూ దాయాది దేశం పాక్ కు మద్దతు ఇస్తారా అంటూ ఇండియన్స్ క్రీడాభిమానులు రెచ్చిపోతున్నారు.
గురువారం దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన పాక్ -ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమి ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో కూర్చుంది సానియా. ఇందులో పాక్ జట్టుకు సపోర్ట్ చేస్తూ కనిపించింది ఆమె. టీ -20 ప్రపంచ కప్ లో ఇండియా వివిధ జట్లతో తలపడిన సమయంలో ఒక్క మ్యాచ్ కు హాజరు కానీ సానియా.. పాక్ మ్యాచ్ కు మాత్రం హాజరు కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా – పాక్ మధ్య మ్యాచ్ జరిగిన సమయంలోనూ సానియా దాయాది దేశానికే మద్దతు ఇచ్చి ఉంటుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే సానియాకు ఇండియా పౌరసత్వం రద్దు చేసి… పాక్ పౌరసత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపై సానియా ఆడే టెన్నిస్ టోర్నమెంట్లను బాయ్‌కాట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు
సానియా మీర్జా పాక్ క్రీడాకారుడు షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.