Wednesday, April 13, 2022
HomePoliticsటీఆర్ఎస్ కు 30 సీట్లు కూడా కష్టమే... పీకే అంత మాట అన్నారా..?

టీఆర్ఎస్ కు 30 సీట్లు కూడా కష్టమే… పీకే అంత మాట అన్నారా..?




ప్రజా శాంతి పార్టీ అద్యక్షుడు , క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో 30 సీట్లు కూడా రావని ఆ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా సేవలందిస్తోన్న ప్రశాంత్ కిషోర్ తనతో చెప్పారని కేఏ పాల్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

బుధవారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌంద‌ర రాజ‌న్‌తో కేఏ పాల్ భేటీ అయ్యారు. ఆమెతో పలు అంశాలపై చర్చించిన కేఏ పాల్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు. కేసీఆర్ పాలన అంత అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. ఇంత అవినీతి సర్కార్ ను తాను జీవితంలో చూడలేదని తెలిపారు.

అవినీతిపాలన చేస్తున్నా కేసీఆర్ తొందర్లోనే అరెస్ట్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు కేఏ పాల్. కేసీఆర్ ను గద్దె దించేందుకు తాను అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చానని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ కు ప్రత్యామ్నాయం తానేనని చెప్పుకొచ్చారు. విజయనగరం నుంచి కేసీఆర్ కుటుంబీకులు తెలంగాణకి వచ్చారన్న కేఏ పాల్ .. తాను విశాఖపట్నం నుంచి వచ్చినట్లు చెప్పారు.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments