యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి దాడి చేసింది. ప్రాంక్ వీడియోలు చేస్తూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నడిరోడ్డుపైనే చితకబాదింది.
శ్రీకాంత్ రెడ్డి చేసే వీడియోలపై ఇప్పటికే కంప్లైంట్స్ ఉన్నాయి. మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులకు ఇటీవల ఓ వ్యక్తి ఫిర్యాదు కూడా చేశాడు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ రెడ్డి ఇంటికెళ్ళినా కరాటే కళ్యాణి అతనిపై దాడి చేసింది. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలోని మధురానగర్లో ఈ ఘటన జరిగింది.
మహిళలతో ప్రాంక్ పేరుతో శ్రీకాంత్ రెడ్డి చేసే వీడియోలపై నిలదీసేందుకు అతని ఇంటికి వెళ్ళింది కరాటే కళ్యాణి. ప్రాంక్ వీడియోలపై అతని నిలదీసింద. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని…యువతలోకి తప్పుడు సందేశం వెళ్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది.
దీంతో మధురానగర్ లోని నడిరోడ్డుపై శ్రీకాంత్ రెడ్డి చెంప చెళ్లుమనిపించింది. అంతేకాకుండా స్థానికులు కూడా శ్రీకాంత్ రెడ్డి వ్యవహరశైలిని తప్పుబడుతూ అతనిపై దాడికి పాల్పడ్డారు.