Wednesday, May 4, 2022
HomeMovieర్యాగింగ్ చేయడంతో మహేష్ బాబు ను కొట్టాను - కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్

ర్యాగింగ్ చేయడంతో మహేష్ బాబు ను కొట్టాను – కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్




మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ” సర్కారు వారి పాట”. ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది. భారీ అంచనాల నడుమ ఈ మూవీలో మహేష్ బాబు సరసన మహానటి( కీర్తి సురేష్ ) నటించింది. ఈ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.

ఇందులో భాగంగా సర్కారు వారి పాట సాంగ్ షూటింగ్ సందర్భంగా తనకు, మహేష్ బాబుకు మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్‌ని హీరోయిన్ కీర్తి సురేష్ షేర్ చేసుకుంది. కీర్తి సురేష్‌ని మహేష్ బాబు తన పంచ్ డైలాగ్‌లతో ఆటపట్టించాడా లేదా అని అడిగారు యాంకర్. ఇందుకు కీర్తి సురేష్ స్పందిస్తూ, షూటింగ్ సమయాల్లో మహేష్ బాబు తనను చాలా ఆటపట్టించాడని, ఇది నిజంగా చాలా సరదాగా ఉందని చెప్పింది.

ఓ పాట షూటింగ్ సమయంలో తాను టైమింగ్ కోల్పోయానని, స్టెప్పులు వేయలేదని.. దాంతో చిరాకుగా మహేష్ బాబు తలని రెండుసార్లు కొట్టానని చెప్పింది. అందుకు తాను అతనికి క్షమాపణలు చెప్పానని పేర్కొంది. అయితే మూడోసారి కూడా అదే పునరావృతమైందని ఆమె పేర్కొంది. ఈసారి మహేష్ బాబు తనపై పగ తీర్చుకుంటున్నావా అని అడిగాడని కీర్తి సురేష్ తెలిపింది.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments