Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsమహా నటికీ కరోనా పాజిటివ్

మహా నటికీ కరోనా పాజిటివ్

చిత్ర పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజాగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కు పాజిటివ్ అని తేలింది. సల్ప లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు కీర్తి.

ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నానని.. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. థర్డ్ వేవ్ ను అందరూ సీరియస్ గా తీసుకోవాలని నిర్లక్ష్యం వహించవద్దని తెలిపారు. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. వ్యాక్సిన్ అందరూ తీసుకొని.. ప్రియమైన వారి కోసం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments