Friday, April 29, 2022
HomeMovieకేజీఎఫ్ 2ఎంత వసూళ్లు చేసిందో తెలుసా..?

కేజీఎఫ్ 2ఎంత వసూళ్లు చేసిందో తెలుసా..?




రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విడుదలైన కేజీఎఫ్ – 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీని సృష్టిస్తోంది. ఈ నెల 14న రిలీజ్ అయిన కేజీఎఫ్ – 2 , కన్నడ భాషలతోపాటు వివిధ భాషలోనూ ప్రేక్షకులను అలరించింది. భావోద్వేగాల నడుమ సాగే ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ప్రతిచోట ఈ సినిమా భారీగా వసూళ్లను చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ – 2 121.30 కోట్ల గ్రాస్ ను , 75.45 కోట్ల షేర్ ను సాధించింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 942 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. వసూళ్ల పరంగా ఇంకా ఈ సినిమా కొత్త రికార్డులను సెట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రశాంత్ నీల్ డైరక్షన్ స్టైల్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్, యష్ ఫెర్ఫామెన్స్ , సంజయ్ దత్ విలన్ క్యారెక్టర్ ఈ సినిమాకు ప్లాన్ పాయింట్స్ గా చెప్పొచ్చు. కొన్నిచోట్ల ఎమోషన్స్ ను హైరేంజ్ లో చూపించి సినిమాకు జీవం పోశారు. సినిమా ఎండింగ్ లో కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా ఉంటుందని ముగించారు.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments