దేశంలో కరోనా విస్తరణ నేపథ్యంలో కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఇదివరకున్న మార్గదర్శకాలను కాస్త సవరించింది కేంద్రం.
అయితే తాజా గైడ్ లైన్స్ లో చిన్నారులకు మాస్క్ అవసరం లేదని పేర్కొంది కేంద్రం. ఐదేళ్ళ లోపు ఉన్న చిన్నారులకు మాస్క్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అలాగే ఆరేళ్ళ నుంచి పదకొండేల్ల పిల్లలను మాస్క్ ధరించేలా చూడాలని పేర్కొంది. 12 ఏళ్ళు దాటిన వారు మాత్రం ఖచ్చితంగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.