Monday, June 6, 2022
HomePoliticsLatest Newsవారసుల కోసం నేతల తిప్పలు - అప్పుడే స్కెచ్ ల మీద స్కెచ్ లు

వారసుల కోసం నేతల తిప్పలు – అప్పుడే స్కెచ్ ల మీద స్కెచ్ లు




తెలంగాణలో ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ లేదని,.. ముందస్తుకు ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ నేతలు. తమ కుమారులు, కుమార్తెలకు పొలిటికల్ ప్లాట్ ఫార్మ్ రెడీ చేయాలని ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. కొంతమంది పాలిటిక్స్ నుంచి పక్కకుతప్పుకొని వారసులకు అవకాశం ఇవ్వాలని తలుస్తుంటే.. మరికొంతమంది మాత్రం తమతోపాటు తమ వారసులకూ టికెట్ ఇవ్వాలని ఇప్పటే నుంచే వ్యూహరచన చేస్తున్నారు.

ఇందులో భాగంగా వారసులను ఆయా నియోజకవర్గాల్లో యాక్టివ్ చేస్తున్నారు సీనియర్ నేతలు. తమ పనుల్లో కొన్నింటిని వారసులకు అప్పగించేసి పనితీరును, అధికారులతో ఎలా డీల్ చేస్తున్నారని వాచ్ చేస్తున్నారు. ఓ రకంగా అనధికారిక ఎమ్మెల్యేగా కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల వారసులు చక్రం తిప్పుతున్నారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు వచ్చే ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కాదంటే…చేవెల్ల లోక్ సభ స్థానం నుంచి తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఇక, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ కు మరో ఛాన్స్ ఇవ్వాలని పట్టుబట్టనున్నారు. అవకాశం వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారన్న చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యే మైనంపల్లి తనతోపాటు తన కుమారుడికి ఛాన్స్ ఇవ్వాలని కోరనున్నారని తెలుస్తోంది.

తన సిట్టింగ్ స్థానం నుంచి కుమారుడి గెలుపు ఈజీ అవుతుందని.. తనకు నిజామాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరనున్నారు మైనంపల్లి. రెండు స్థానాల్లో గెలుస్తామని ధీమాగా ఉన్నారట. పద్మారావు గౌడ్ కూడా తన కుమారుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నించనున్నారు. ముషీరాబాద్ నుంచి మాజీ మంత్రి నాయిని నరసింహ రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మామ పేరు మీద సేవా కార్యక్రమాలు చేపడుతు నియిజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నారు. అదేసమయంలో బీజేపీ తరుఫున లక్ష్మణ్ కు రాజ్యసభ సీట్ దక్కడంతో ముషీరాబాద్ నుంచి గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తెను బరిలో నిలపాలని చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తోన్న ముఠా గోపాల్ తన కుమారుడిని రంగంలోకి దింపాలని చూస్తున్నారు.

కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తన కుమారుడికి మరోసారి ముషీరాబాద్ టికెట్ ఇవ్వాలని పీసీసీపై ఒత్తిడి చేయనున్నారని తెలుస్తోంది. అయితే..ఒకే కుటుంబం నుంచి ఒకరికే టికెట్ ఇవాలని చింత శివిర్ లో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో అంజయ్ కుమార్ యదవ్ కుమారుడికి అవకశం ఇస్తారా..? లేక తను తప్పుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. గోషామహల్ నుంచి మాజీ మంత్రి విక్రం గౌడ్ బీజేపీ తరుఫున టికెట్ ఆశిస్తున్నారు. కాని రాజాసింగ్ ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచినా నేతగా ఉండటంతో విక్రం గౌడ్ కు  స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. మరి ఇందుకు ఆయన అంగీకరిస్తారో లేదు చూడాలి.

ఇలా మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు.. తమ వారసులకు టికెట్ ఇప్పించుకునేందుకు ఇప్పటి నుంచి కసరత్తు చేస్తున్నారు.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments