Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsతెలంగాణలో లాక్ డౌన్ - మంత్రి కేటీఆర్ క్లారిటీ

తెలంగాణలో లాక్ డౌన్ – మంత్రి కేటీఆర్ క్లారిటీ

తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న దృష్ట్యా థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి తరువాత కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఈ నెల చివరి వారంలో లేదా, ఫిబ్రవరి మొదటి వారంలో కేసులు పతాక స్థాయికి చేరుతాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తారు లేదా లాక్ డౌన్ అమలు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

దీనిపై ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం ద్వారా ఓ నెటిజన్ మంత్రిని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న కారణంగా లాక్ డౌన్ విధిస్తారా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. కరోనా కేసులు, వైద్యారోగ్య సలహాల మేరకు రాష్ట్రంలో లాక్ డౌన్ , రాత్రి పూట కర్ఫ్యూ వంటి నిర్ణయాలు ఉంటాయని సమాధానం ఇచ్చారు. అలాగే మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్.. తనకు నేషనల్ పాలిటిక్స్ పై ఆసక్తి లేదని.. తెలంగాణకు సేవ చేయడమే హ్యాపీగా ఉందని సమాధానం ఇచ్చాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments