కరోనా కేసులు రోజురోజుకు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. కేసుల కట్టడికి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఆదివారం జనవరి (23) న తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఐదు గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పూర్తి స్థాయి లాక్ డౌన్ కు ప్రజలంతా సహకరించాలని తమిళనాడు సర్కార్ కోరింది.