Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsచిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీట్ ఆఫర్ -క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్

చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీట్ ఆఫర్ -క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి భేటీ కావడంపై అనేక రకాల ప్రచారం జరిగింది. టికెట్ ధరలపై చర్చించేందుకు ఆయన జగన్ తో భేటీ అయ్యారని ఓ ప్రచారం జరగగా…రాజ్యసభ సీటు విషయమై సమావేశంలో చిరంజీవి చర్చించారనే ప్రచారం కూడా జరిగింది.

శుక్రవారం ఉదయం నుంచి ఇదే ప్రచారం జరిగింది. మెగాస్టార్ కోసం వైసీపీ రాజ్యసభ సీటు రెడీ చేసిందంటూ ఊహాగానాలు వినిపించాయి. దీనిపై వెంటనే చిరంజీవి స్పందించారు. “రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదు. దయచేసి అసత్య వార్తలను ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నానని చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. న్యూస్ ఛానెల్స్ వ్యూస్ కోసం తప్పుడు వార్తలను ప్రసారం చేయవద్దని సూచించారు. ఏపీ సీఏం జగన్ తో జరిపిన చర్చలకు రాజకీయాలు ఆపాదించొద్దని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments