తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశాన్నికి ఆ శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ డుమ్మా కొట్టారు. తనకు విద్యాశాఖను కట్టబెట్టడంపై బొత్స అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశానికి బొత్స గైర్హాజరు కావడం చర్చనీయంశంగా మారింది.
ఇదివరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ కు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను కట్టబెట్టారు. ఈ శాఖను గతంలో బొత్స నిర్వహించారు. క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణతో ఆదిమూలపు సురేష్ గతంలో నిర్వర్తించిన విద్యాశాఖను బొత్సకు కట్టబెట్టారు. విద్యాశాఖపై బొత్స సత్యనారాయణ ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఆయన పోర్ట్‌ఫోలియోపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌లను బొత్స సత్యనారాయణ సీరియస్‌గా తీసుకున్నారో.. లేక విద్యాశాఖపై ఆసక్తి చూపడం లేదో కాని కాని ఆయన విద్యాశాఖపై జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశానికి మంత్రి బొత్స అందుబాటులో లేరని అధికారులు తెలిపారు. మంత్రి గురించి ముఖ్యమంత్రి అధికారులతో ఆరా తీయగా, మంత్రి అందుబాటులో లేరని అధికారులు చెప్పడంతో సమీక్ష సమావేశానికి వెళ్లారు జగన్. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన కార్యక్రమాలను మంత్రికి వివరించి, కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులకు ఆయన చెప్పినట్లు సమాచారం. సోమవారం ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బొత్స సత్యనారాయణ ప్రస్తుతం తన సొంత జిల్లా విజయనగరంలో పర్యటిస్తున్నారు. బొత్స ఆశించింది రవాణా లేదా పంచాయత్ రాజ్ లేదా ఇతర శాఖలపై ఆసక్తి చూపించారు. కాని ఆయనకు విద్యాశాఖను కట్టబెట్టడంతో అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
మరి, బొత్స అసంతృప్తితో ఆయన శాఖను జగన్ మారుస్తారో లేదో