Wednesday, June 15, 2022
HomePoliticsLatest Newsమంత్రులకు బాధ్యతుండక్కర్లే..!

మంత్రులకు బాధ్యతుండక్కర్లే..!




తెలంగాణ పాలనా గాడి తప్పినట్లుగా కనిపిస్తోంది. మంత్రులపై కేసీఆర్ అజమాయిషీ తప్పిందో ఏమో కాని మినిస్టర్స్ బాధ్యతను మర్చిపోయారు. తమ శాఖలను ఏడాది కాలంలో ఎలా వెలగబెట్టామో వార్షిక నివేదిక విడుదల చేయాల్సిన మంత్రులు అసలు ఆ విషయాన్నే మరిచిపోయినట్టున్నారు. కేవలం కేటీఆర్ తన శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు తప్పితే మిగతా మంత్రులెవరూ అన్యువల్ రిపోర్ట్ ను రిలీజ్ చేయకపోవడం చర్చనీయంశంగా మారింది.

గత ఏడాదిలో తమ శాఖలను పెద్దగా ఒరగబెట్టిందేమి లేదని మంత్రులు వార్షిక నివేదికను బయటపెట్టడం లేదా..? లేక నిర్లక్ష్యమా..? అనే చర్చ రాజకీయ వర్త్గాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. కేసీఆర్ , కేటీఆర్ లపై విపక్షాల నుంచిఎదురుదాడి జరిగితే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి కడిగేసే మంత్రివర్గం… తమ శాఖల విషయంలో మాత్రం మామా అనిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

16 మంది మంత్రులు ఆయా శాఖలనైతే నిర్వర్తిస్తున్నారు కాని, కీ అంతా కేసీఆర్ అండ్ కేటీఆర్ ల చేతిలోనే ఉంటుందని… అలాంటిది ఆ శాఖలపై మంత్రులకు ఎలా పట్టుంటుందనే ప్రశ్నలు రాజకీయ వర్గాలు వినిపిస్తున్నాయి. అందుకే వార్షిక నివేదిక బయటపెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అంటున్నారు. వార్షిక రిపోర్ట్ ను రిలీజ్ చేయడంలో మంత్రులకు బాధ్యత లెకపొతే కనీసం కేసీఆర్, కేటీఆర్ లైనా హెచ్చరించరా అంటూ చెప్పుకొస్తున్నారు.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments