ఇంటిని ఖాళీ చేసిన నాగ చైత‌న్య‌

టాలీవుడ్ లో మోస్ట్ క‌ల‌ర్ ఫుల్ క‌పుల్స్ గా పేరు తెచ్చుకున్న నాగ చైత‌న్య‌, స‌మంత ఇటీవ‌లే విడాకులు తీసుకున్నారు. ఈ నిర్ణ‌యం త‌మ అభిమానుల‌కు పెద్ద షాకింగ్ వార్తే. అయితే, పెళ్లి అయిన‌ప్ప‌టి నుండి హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని అత్యంత కాస్ట్ లీ లోకేష‌న్ లోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉంటున్నారు. అయితే విడాకుల నిర్ణ‌యం తర్వాత అక్క‌డి నుండి చైతూ ఖాళీ చేసి వెళ్లిపోయారు.

Naga Chaitanya-Samantha divorce rumours: Actor finally breaks silence |  Sambad English

త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఇల్లు లేక‌పోవ‌టంతో చైతూ ఇప్పుడు భారీగా ఖ‌ర్చు చేస్తూ జూబ్లీహిల్స్ లోని ఓ ఖ‌రీదైన ప్రాంతంలో స్థ‌లం కొన్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఇంటి నిర్మాణ ప‌నులు కూడా మొద‌లుపెట్ట‌బోతున్నార‌ట‌. అంతేకాదు గ‌చ్చిబౌలిలోని కాస్ట్ లీ ప్లేస్ లో ఖ‌రీదైన విల్లా కూడా కొనుగోలు చేశార‌ట‌. ఇటీవ‌లే ఈ విల్లాకు చైతూ షిఫ్ట్ అయ్యార‌ని తెలుస్తోంది.

చైతూ ప్ర‌స్తుతం థ్యాంక్యూ సినిమా చేస్తున్నారు.