మ‌హా స‌ముద్రంను ద‌క్కించుకున్న నెట్ ఫ్లిక్స్

మహా సముద్రం సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతుంది. శ‌ర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు హైద‌రి, అనూ ఇమాన్యుయేల్ హీరో హీరోయిన్స్ గా న‌టించిన ఈ సినిమాకు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అక్టోబ‌ర్ 14న మ‌హా స‌ముద్రం విడుద‌ల కానుంది.

Maha Samudram (2021) | Maha Samudram Movie | Maha Samudram Telugu Movie  Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat

ఇప్ప‌టికే మంచి బ‌జ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ త‌ర్వాత ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌బోతున్నారు.

ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.