Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsబీజేపీలో తారాస్థాయికి విబేధాలు- బండి సంజయ్ కు కొత్త చిక్కులు

బీజేపీలో తారాస్థాయికి విబేధాలు- బండి సంజయ్ కు కొత్త చిక్కులు

కరీంనగర్ జిల్లాలో బీజేపీ నేతల మధ్య వర్గపోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అద్యక్షుడు , ఎంపీ బండి సంజయ్ తమను పట్టించుకోవడం లేదని సీనియర్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న తమను కలుపుకుపోవడం లేదని సంజయ్ పట్ల గుర్రుగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తమకు సమాచారం అందించడం లేదని సీనియర్ నేతలు సీరియస్ గా ఉన్నారు.

ఇటీవలే సంజయ్ వ్యతిరేక వర్గమంతా సమావేశమై జిల్లా రాజకీయాల్లో బండి వన్ మ్యాన్ షో పై చర్చించినట్లు తెలుస్తోంది. బండి వ్యవహారశైలి మార్చుకోకపోతే హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలని సీనియర్లు భావిస్తున్నారు. ఈ వార్తలను బండి వర్గం మాత్రం తోసిపుచ్చుతోంది. అలాంటిదేమీ లేదని.. జిల్లా బీజేపీ శ్రేణులు ఉమ్మడిగా పని చేస్తున్నాయని చెబుతున్నారు. సంజయ్ అందర్నీ కలుపుకుపోతు , జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని చెబుతున్నారు. బండి సంజయ్ అందర్నీ కలుపుకుపోతున్నారు కనుకే ఆయన అధ్యక్షుడు అయ్యాక జరిగిన మూడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రెండింటింలో పార్టీ విజయం సాధించడమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. సీనియర్ల అలక ను కొట్టిపారేస్తున్నారు.

కరీంనగర్ జిల్లా బీజేపీలో విబేధాలు ఇప్పటివి కావు. సంజయ్ రాష్ట్ర బీజేపీ అద్యక్ష బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇటీవల నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో….బండి వ్యతిరేక వర్గమంతా పది నెలల కిందటే ఈ విషయాన్ని బీజేపీ అగ్రనేతలకు చేరవేసినట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ అద్యక్షులుగా పని చేసిన ఇద్దరి నేతల వద్దకు ఈ పంచాయితీని తీసుకెళ్ళినట్లు సమాచారం. ఇక, ఈటల ను కూడా అయిష్టంగానే బండి వర్గం పార్టీలో ఆహ్వానించేందుకు అంగీకరించిందని టాక్ వినిపిస్తోంది. అందుకే ఈటల వర్గంగా ఉన్న రవీందర్ సింగ్ ను బీజేపీలోకి ఆహ్వానించలేదని బండి వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. జిల్లాలో ఏ పని చేపట్టినా.. సీనియర్లకు బండి సంజయ్‌ సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments