వాట్సప్ వాడేందుకు కూడా మతాలు అడ్డువస్తాయా…? హెడ్ లైన్ చూశాక చాలా మందిలో వచ్చే ఫస్ట్ రియాక్షన్. కానీ కమ్యూనిస్ట్ దేశం చైనాలో మాత్రం అవును అనే సమాదానం వస్తోంది. అక్కడి సాంప్రదాయ ముస్లీం మహిళలు వాట్సప్, జీమెయిల్ వంటివి వాడితే తీవ్ర చర్చలుంటాయని, ఎవరు వాడుతున్నారో సైబర్ క్రైమ్స్ నుండి డేటా కూడా సేకరిస్తున్నట్లు బయటపడటం సంచలనంగా మారుతోంది.
యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ స్డూటెండ్ ఇష్యూ ద్వారా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఆ స్టూడెంట్ తన హోంవర్క్ పంపేందుకు జీమెయిల్ వాడారు. దీంతో ఆమెను ట్రేస్ చేసి రీఎడ్యూకేషన్ సెంటర్ కు పంపారు. ఈ ఘటన 2018లో జరగ్గా… అక్కడ ఆ విద్యార్థి ఏకంగా 6 నెలల పాటు ఉండాల్సి వచ్చిందట. అక్కడి నుండి వచ్చిన తర్వాత కూడా తనపై మానిటరింగ్ ఉంచారట. దీంతో 2019లో ఆమె అమెరికాకు వెళ్లిపోయారట. అయితే… 2018లో తను చైనాలో ఉండే నాటికే ఆమెకు అమెరికా పౌరసత్వం ఉందని తెలుస్తోంది.