కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న సినిమా నుంచి క్రేజీ ఆప్డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ తో ఓ భారీ డైలాగ్ చెప్పించారు. ‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు అవసరానికి మించి తను ఉండకూడదని, అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా ..” ఇది టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ తో వచ్చేసిన డైలాగ్.
సముద్రతీరం, అలలు , కత్తుల కనిపిస్తూ టీజర్ క్రేజీ గా అనిపిస్తోంది. అనిరుద్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది. రత్నవేలు డీవోపీ. అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యశోద ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు.