మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దాంతో ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాను. తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తనను కలిసేందుకు నియోజకవర్గ ప్రజలు ఎవరూ రావొద్దని సూచించారు. ఏవైనా అత్యవసర విషయాలపై తన వ్యక్తిగత సిబ్బందిని సంప్రదించాలని పద్మా దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తనను ఇటీవల కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.