Thursday, April 7, 2022
HomeOpinionసరైన వసతులు లేక కూలీలుగా విద్యార్థులు..!

సరైన వసతులు లేక కూలీలుగా విద్యార్థులు..!




ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(విజృంభణ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం విద్యార్థుల పక్షాన మీకు విన్నవించునది ఏమనగా కరోనా మూడవ వేవ్ రిత్యా ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ మీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యలో ఓయూ, జె ఎన్ టి యు, కె.యు లు ఆన్ లైన్/డిజిటల్ విద్యభోదన జరుపుతున్నాయి. విద్యశాఖ ముఖ్య కార్యదర్శి డిగ్రీ విద్యార్థులకు ఆన్ లైన్ భోదన జరపాలని ఉత్తర్వులు జారీ చేశారు. కాని పేద, మద్య తరగతి విద్యార్థుల వద్ద ఆన్ లైన్ ఉపకరణాలు (కంప్యూటర్,ల్యాప్ టాప్, ఐ ట్యాబ్, ఆండ్రాయిడ్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్టీవిటి) లేక పాఠాలు వినటం లేదు.

రెక్కాడితే గానీ డొక్కాడని తల్లితండ్రులు వారి పిల్లలకు వేల రూపాయలు ఖర్చుపెట్టి ఆన్ లైన్ ఉపకరణాలు అందించలేరు. ఇలాంటి సందర్బంలో డిజిటల్/ఆన్ లైన్ భోదనకు మొగ్గుచూపుతున్న తెలంగాణ సర్కారు పేద,మధ్యతరగతి విద్యార్థులు ఆన్ లైన్/డిజిటల్ పాఠాలు వినేందుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవటం భాద్యత రాహిత్యం అవుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మొదటి, రెండవ కరోనా వేవ్ లలో ఆన్ లైన్/డిజిటల్ భోదన పాఠాలు అందక లక్షలమంది పేద విద్యార్థులు నష్టపోయారు. ఆన్ లైన్ ఉపకరణాలు అందించకుంటే మూడవ వేవ్ లో కూడా విద్యకు పూర్తిగా దూరమయ్యి పాఠశాల విద్యార్థులు రోజూవారి కూలీలుగా, మేకల కాపరులుగా మారి ,డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం వుంది.

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేల ఆన్ లైన్ విద్యభోదననే ప్రత్యామ్నాయమనేది స్పష్టమవుతున్నప్పటికీ మీ నాయకత్వంలోని ప్రభుత్వం ఎందుకు ఆన్ లైన్/డిజిటల్ పాఠాలు విద్యార్థులకు చేర్చేందుకు కనీస సౌకర్యాలు మెరుగుపరచటం లేదు. పర్యావేక్షణ కరువుతో దూరదర్శన్/టి-శాట్ పాఠాలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు చేరే పరిస్థితి లేదనేది మీకు గుర్తు చేస్తున్నాము. కరోనా విపత్తు దృష్ట్యా తక్షణం నిధులు మంజూరు చేసి ప్రతి విద్యార్థికి ట్యాబ్ పంపిణీ చేయటంతో పాటు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించి బడుగుబలహీన వర్గాల విద్యార్థుల చదువులు కొనసాగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. ఆన్ లైన్ పాఠాలు గ్రామ, బస్తీ స్థాయిలో ప్రతి విద్యార్థికి చేర్చేందుకు భాద్యతయుతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.

కోట. ఆనంద్,
PDUSU (విజృంభణ),
ప్రధాన కార్యదర్శి.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments