ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఫిలాసఫీ డిపార్టుమెంట్ మూతపడనుంది. ఈ డిపార్ట్ మెంట్ కు చెందిన ప్రొపెసర్లందరూ పదవి విరమణ చేయగా మిగిలివున్న ఒకే ఒక్క ప్రొపెసర్ కృష్ణారావు ఆన్నీ తానై డిపార్టుమెంట్ ను నడుపుతున్నారు. కాని తాజాగా ఆయన మహాత్మ గాంధీ యూనివర్సిటీకి రిజిస్ట్రార్ గా నియమితులవ్వటంతో తత్వశాస్త్రం డిపార్ట్మెంట్ భవిష్యత్తు ఆందాకారంలో పడింది.
2019లో ప్రొఫెసర్ శంకశాల మల్లేశం పదవి విరమణ తర్వాత ప్రొపెసర్ కృష్ణారావు డిపార్టుమెంట్ హెడ్ గా, బోర్డు ఆఫ్ చైర్ పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరొక అసిస్టెంట్ ప్రొఫెసర్ వంశీధర్ నిజాం కళాశాలలో బోదిస్తున్నారు. వీరితో పాటు పరిశోధక విద్యార్థులు కూడా పి.జి విద్యార్థులకు పాఠాలు బోదిస్తున్నారు. ఉన్న ఒక్క ప్రొపెసర్ కృష్ణారావు మహౕత్మగాందీ యూనివర్సిటీకి వెళ్తే ఓయూలో డిపార్టుమెంట్ నడిచేదెలా ? ఈ పరిస్థితి ఫిలాసఫీ డిపార్టుమెంట్ కే కాదు, ఉస్మానియా యూనివర్సిటీలోని అనేక డిపార్టుమెంట్ లలో నెలకొన్నది.
తెలంగాణ సర్కారు నిర్లక్ష్య వైఖరితో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తి ప్రక్రియ ముందుకు పోవటం లేదు. కొత్త ప్రొపెసర్లు రావటం లేదు. పాలకుల నిర్లక్ష్యంతో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన కోర్సులు చదవలేకపోతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ సర్కారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.
కోట . ఆనంద్,
M.A(Philosophy),
PDSU (విజృంభణ),Gen.Secretary.