రాహుల్ గాంధీపై రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఈడీ విచారణ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ… దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ల ముట్టడికి పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా రాజ్ భవన్ ముట్టడిలో భాగస్వామ్యం అయ్యారు. ఈ నిరసన కార్యక్రమం సూపర్ సక్సెస్ అయినప్పటికీ..పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేత చామల కిరణ్ ను గొడ్డును బాదినట్టు బాదారు పోలీసులు. ఒక్కడిని లక్ష్యంగా చేసుకొని చుట్టూ కర్రలతో మోహరించిన ఖాకీలు కిరణ్ ను ఎడాపెడా వాయించారు. పోలీసులను దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తోన్న ఏమాత్రం కనికరించకుండా కఠినంగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన వారంతా తెలంగాణ నిలువెల్లా గాయాల వీణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సమైక్య పాలనలో కనిపించని నిర్బంధం… అణచివేత, పోలిసుల జులుం స్వరాష్ట్ర పాలనలో, ఉద్యమ సేనానని గొప్పగా చెప్పుకునే కేసీఆర్ పాలనలో కూడా అంతకు మించిన అణచివేత కనిపించడం విషాదం. నాడు.. నిరసనకారులపై పోలీసులతో విరుచుకుపడమని ఆదేశిలిస్తే టీఆరెస్ నేతలు రోడ్లపైకి వచ్చేవారా అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.