రెమ్యూన‌రేష‌న్ పెంచేసిన ప్ర‌భాస్

వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న హీరో ప్ర‌భాస్. ప్ర‌భాస్ రాధేశ్యామ్, స‌లార్, ఆదిపురుష్ తో పాటు అమితాబ్, దీపికాతో క‌లిసి మ‌రో సినిమా కూడా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీటితో పాటు మ‌రిన్ని భారీ బ‌డ్జెట్ సినిమాలు ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

Prabhas (@PrabhasRaju) | Twitter

ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకు దాదాపు 100కోట్లు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న ప్ర‌భాస్… ఇప్పుడు త‌న ఫీజును ఏకంగా 150కోట్ల‌కు పెంచేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు నిర్మాత‌లు సైతం అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజుతో పాటు యూవీ క్రియేష‌న్స్ ప్ర‌భాస్ తో సినిమాకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ తో పాటు ప్ర‌శాంత్ నీల్ నెక్ట్స్ ఫిల్మ్స్ చేసేందుకు ఇప్ప‌టికే క‌థ‌లు రెడీ చేశారు.