Friday, April 29, 2022
HomeMovieకేజీఎఫ్ చాప్టర్ 3లో ప్రభాస్

కేజీఎఫ్ చాప్టర్ 3లో ప్రభాస్




ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది వేసవిలో ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా..కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా ఉండనుందని పేర్కొన్న ప్రశాంత్ నీల్… సలార్ సినిమా చిత్రీకరణ అనంతరం ఈ సినిమాపై ఫోకస్ పెట్టనున్నారు.

అయితే, కేజీఎఫ్ చాప్టర్ 3లో ప్రభాస్ ను తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. యష్ తో కలిసి మల్టిస్టారర్ సినిమా చేస్తే చూడాలని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ తో పాన్ ఇండియా హీరోగా యష్ , ఆల్రెడీ బహుబాలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఈ ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక్క రికార్డు కూడా మిగలదని, చూసే ఆడియన్స్ కి కూడా అద్భుతమైన అనుభవం కలుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

కేజీఎఫ్ చాప్టర్ 3లో ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments