Sunday, June 5, 2022
HomePoliticsLatest Newsమైనర్ బాలికపై అత్యాచారం - కీలక ఆధారాలను బయటపెట్టిన రఘునందన్

మైనర్ బాలికపై అత్యాచారం – కీలక ఆధారాలను బయటపెట్టిన రఘునందన్




తాజాగా ఓ పబ్ కేంద్రంగా మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. బాలికపై కీచక పర్వంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుతోపాటు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, హోంమంత్రి మహమూద్ అలీ మనవడు ఉన్నాడని క్రిమినల్ లాయర్ అయిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించి మరుసటి రోజే అందుకు సంబంధించిన కీలక ఆధారాలను బయటపెట్టి సంచలనాలకు తెరలేపారు.

శుక్రవారం రఘునందన్ రావు మీడియా ముందుకు వచ్చి ఈ కేసులో ప్రముఖుల పిల్లలు ఉన్నారని చెప్పడం.. ఆ తరువాత ఈ ఘటనలో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడంతో శనివారం మరోసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రఘునందన్ రావు… మైనర్ బాలికతో బెంజ్ కారులో కలిసి ఉన్న అసలు ఎమ్మెల్యే కుమారుడి ఫోటోలను, వీడియోలను మీడియా ముందు రిలీజ్ చేసి పోలీసులకు ఝలక్ ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..ఈ వీడియోలు రఘునందన్ రావుకు ఎలా చేరాయని ఆరా తీశారు.

తన దగ్గర ఉన్న ఆధారాలు కావాలంటే డీజీపీకి ఇస్తానని రఘునందన్ ప్రకటించారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెబుతున్నారు. బెంజ్ కారులో అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడితే.. ఇన్నోవాలో ఉన్నవారిపై కేసులు పెట్టి.. అసలైన వాళ్లను తప్పించాలనుకుంటున్నారని రఘునందన్ అంటున్నారు. ఈ కేసు విషయంలో పోలీసుల వ్యవహారశైలి దారుణంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments