Saturday, January 22, 2022
HomePoliticsLatest Newsనన్ను హతమార్చేందుకు జార్ఖండ్ నుంచి దుండగులు - ఎంపీ సంచలన వ్యాఖ్యలు

నన్ను హతమార్చేందుకు జార్ఖండ్ నుంచి దుండగులు – ఎంపీ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని చంపేస్తున్నారని ఆరోపించారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య అందులో భాగమేనన్నారు. తనను కూడా అంతమోదించేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని పేర్కొన్నారు.

20 మందిని జార్ఖండ్ నుంచి రౌడి షీటర్లను తీసుకొచ్చి… తనను హతమార్చేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు రఘురామ. ప్లాన్ ప్రకారం కేసులు నమోదు చేసి తనను ఏపీకి రప్పించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే తాను కేసుల విషయమై ఏపీకి వస్తే తనను హత్య చేసి డమ్మీ కేసు కింద కొట్టివేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. అందుకు సంబంధించిన సమాచారం ఉందని పేర్కొన్నాడు. ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని తెలిపాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments