హైదరాబాద్ బంజారాహిల్స్ ర్యాడిసన్ బ్లూ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సింగర్, బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పట్టుబడ్డారనే వార్తలపై ఆయన స్పందించారు. తాను పబ్ లో ఉన్నమాట వాస్తవమేనని కాని , తాను డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు.
Also Read : పబ్ లో డ్రగ్స్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సెలబ్రీటీలు
స్నేహితుడి బర్త్ డే ఉంటే ఆ పబ్ కి వెళ్ళానని అంతేకాని తాను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పాడు రాహుల్. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదన్నాడు. సమయానికి మించి పబ్ నడిపిన యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా తనను డ్రగ్స్ వ్యవహరంలోకి లాగడం ఏంటని ప్రశ్నించాడు.
బంజారాహిల్స్ పబ్ లో పట్టుబడిన వారిలో సినీ నటి నిహారిక కొణిదెల కూడా ఉన్నారు. పబ్ యజమాని సహా 144 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని విచారించి అనంతరం నోటిసులు ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో మరోసారి కలకలం రేపింది.