Friday, January 21, 2022
HomePoliticsLatest Newsసవాల్ విసరడం కాదు కేటీఆర్... మొదట ఆ పని చెయ్

సవాల్ విసరడం కాదు కేటీఆర్… మొదట ఆ పని చెయ్

మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సవాల్ కూడా సై అన్నారు. తాను సవాల్ స్వీకరిస్తున్నానని ప్రకటించిన రేవంత్ ప్రతి సవాల్ గా ఓ యూ ట్యుబ్ ఛానెల్ స్టూడియోలో చర్చకు సిద్దమని ప్రకటించారు. కాని రేవంత్ సవాల్ కు మంత్రి కేటీఆర్ మరోసారి తోక ముడిచి నవ్వుల పాలయ్యారు. నెటిజన్లు కూడా ఆయన్ను రేవంత్ తో చర్చకు ఎందుకు వెనకడుగు వేశారని పదేపదే ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ మరోసారి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు.

గతంలో కేసీఆర్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తు.. సవాల్ విసిరి, డిబేట్స్ నుంచి పారిపోవడం వంటివి కాకుండా.. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. 2017 ఏప్రిల్ 13 న రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు రేవంత్. ఆ హామీ ఇచ్చి నాలుగేళ్ళు అవుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదని మండిపడ్డారు. రైతుల కోసం ఆ హామీని నెరవేర్చాలని కేటీఆర్ ను డిమాండ్ చేస్తున్నానని ట్వీట్ చేశారు రేవంత్.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
NR Collections Appearls

Most Popular

Recent Comments